Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్: అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ , ఎమ్మెల్యే

29-01-2024: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ గౌతమ్ గారి అధ్యక్షతన జరిగింది.
దళితులకు అందాల్సిన పరి హారాలు, అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ ఐఎన్ నగర్ కాలనీ కాలనీలో గల శ్రీ జయగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చెందిన స్థలంలో దళితులపై దేవదాయ శాఖ తరపున వచ్చిన నోటీసుల గురించి , నేరేడ్మెట్ డివిజన్లోని డిఫెన్స్ కాలనీలో గల స్ట్రీట్ వండర్పై వచ్చిన నోటీసుల గురించి , వినాయక్ నగర్ లోని తారక రామనగర్ దినకర్ నగర్ లలో రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే దళితులకు వచ్చిన నోటీసుల గురించి, జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, లైబ్రరీ భవనాలకు స్థలం కేటాయించాలని, కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజే సిన *మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు . మల్కాజిగిరి రెవెన్యూ, డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్లలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. అట్రాసిటీ కేసుల విచారణలో అలసత్వం చేయవద్దని సూచించారు. చట్టంపై అందరికి అవగాహన కల్పించాలన్నారు. కేసుల్లో జాప్యం కారణంగా బాధితులు ఇబ్బందులు పడ కుండా చూడాలన్నారు. తహసీల్దార్లు ఇలాంటి కేసుల పరిష్కారానికి అవసరమైన కులధ్రువీక రణ పత్రాలను పరిశీలించి సకాలంలో జారీ చేయాలన్నారు. సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శరత్ చంద్రారెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, DCP నిఖిత,ఏసీపీ వెంకట్రెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీకర్ రెడ్డి, ఏస్ సి డెవలప్మెంట్ ఆఫీసర్ వినోద్ కుమార్ ఈ . డి.బాలాజీ, రెవెన్యూ ఆర్ డి ఓ లు, ఎమ్మార్వోలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పోలీసులు ఉన్నతాధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, రాజు వస్తాద్ , తదితరులు పాల్గొన్నారు

      

Gallery

Latest News