ఈరోజు (14-03-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి వచ్చిన వినతి పత్రాలను కమిషనర్ గారికి అందజేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. అందుకు గాను కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ , మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, రాము యాదవ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, అనిల్ కిషోర్, ఇబ్రహీం, రాజు, తదితరులు పాల్గొన్నారు.