వినాయక నగర్ డివిజన్ లోని తారకరామా నగర్ , దినకర్ నగర్ ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల నివాసాలకు సంబంధించి రైల్వే శాఖ వారి నుండి నోటీసులు పంపగా పేద ప్రజలు భయాందోళనకు గురై ఈరోజు ఆ నోటీసులు తీసుకొని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటానని న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వినాయక నగర్ బి ఆర్ ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, సురేష్, శ్రీనివాస్, శేఖర్ గౌడ్, ఫరీద్, బాలకృష్ణ, ఉమేష్, గోపాల్, కాలనీవాసులు, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.