కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బిఅర్ఏస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కు నేడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.