Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు ..బయట మీడియా తో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. అయితే అక్కడ అందరూ ఎమ్మెల్యేలు నేలపై బైఠాయించారు.

ఈ సందర్భంగా- మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని

పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప , ఏమీ చేయడం లేదు,

రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తాం?
ప్రజలకు ఒక మంచి పాలన ఏ విధంగా అందిస్తామని అనే మాటని వారు తీసుకురాకపోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉందని అన్నారు .

అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నాం

చెప్పలేని భాషలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి.. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు

సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది

కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? అని ప్రశ్నించారు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Gallery

Latest News