Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

138 మౌలాలి డివిజన్ బి అర్ ఎస్ నాయకుల మల్కాజ్ గిరి నియోజక వర్గ పార్లమెంటరీ సన్నాహక సమావేశం

మౌలాలి డివిజన్ : ఈరోజు మౌలాలి డివిజన్ లోని మల్కాజ్ గిరి రాయల్ ఫంక్షన్ హాల్ లో బి ఆర్ ఎస్ నాయకులు భాగ్యనంద్ గారి అధ్యక్షతన మౌలాలి డివిజన్ బి అర్ ఎస్ నాయకుల మల్కాజ్ గిరి నియోజక వర్గ పార్లమెంటరీ సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్ గిరి నియోజకవర్గం పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , రావుల అంజయ్య, మౌలాలి డివిజన్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అమీనుద్దీన్ , జే ఏ సి వెంకన్న, హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల వలె పనిచేసి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన గల్లి సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఢిల్లీ పార్లమెంట్ లో ఉండాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీ లు విఫలమైన విషయంన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని , మల్కాజ్ గిరి రైల్వే చక్రబంధం నుండి విముక్తి పొందాలంటే, మల్కాజ్గిరి మరింత అభివృద్ధి చెందాలంటే , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గం పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ తాను స్థానిక నాయకుడు అని పక్కా లోకల్ , నన్ను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణా గళం విప్పుతనని , ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలిపారు . మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మౌలాలి మాజీ కార్పొరేటర్ ఫాతిమా అమీనుద్దీన్ ,జే ఏ సి వెంకన్న, మేడల మల్లికార్జున్ గౌడ్, ఆదినారాయణ, భాగ్యనంద్, ఇబ్రహీం, ఉస్మాన్ , సత్యనారాయణ,అమిన్, సంతోష్ నాయుడు, సంతోష్ గుప్తా, మహేష్ ,మురళి,మారుతీ ప్రసాద్, నవాబ్, సమీర్ , సంతోష్ గుప్తా, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సాదిక్, గౌస్, సాబీర్, బుద్ధి శ్రీధర్, గౌలికర్ శైలేందర్, దినేష్ ,దుర్గేష్, కిరణ్ కుమార్, జంగయ్య, ఫహీం, నాగేష్, పోచయ్య, నరేష్, బాల్రెడ్డి ,ఆజం, స్వామి, ఉషశ్రీ, రాణి గౌడ్, అనూష రెడ్డి, గాయత్రి, షాహిన్ ,పర్వీన్, గాయత్రి షాహిన్ సుల్తానా, కార్యకర్తలు , మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Gallery