అల్వాల్: ఈ రోజు అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది అని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని నేటి నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మల్కాజ్ గిరి నియోజకవర్గం లో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, మర్రి మమత రెడ్డి, డాక్టర్లు ప్రసన్న , కవిత, మంజుల, వైద్య సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, వి ఎన్ రాజు, మల్లేష్, జావేద్, అరుణ్, సులోచన ఆశా వర్కర్లు బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.