27-02-24: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు త్రాగునీరు , స్పీడ్ బ్రేకర్స్, విద్యుత్ స్తంభాలు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ట్రాఫిక్, పారిశుద్యం, బస్ సౌకర్యం, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో గౌతమ్ నగర్ డివిజన్ గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కిరణ్ పట్నాయక్ , నరసింహ రావు, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.