07-02-2024- నేరేడ్ మేట్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పోలీస్ విభాగానికి చెందిన పలు విషయాలు చర్చించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
*ఇందులో ముఖ్యంగా గత డిసెంబర్ నెలలో ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబర్ నుండి ఫోను కాల్స్ వచ్చి నట్టు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లను నాయకులను భయభ్రాంతులకు గురి చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల విషయంపై పురోగతి గురించి,
*పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ గురించి,
*సీసీ కెమెరాల మానిటరింగ్ గురించి,
*గంజాయి విక్రయాల ప్రదేశాలలో గస్తీ నెలకొల్పాలని,
*ఇటీవల పుట్ పాత్ లపై స్ట్రీట్ వెండర్స్ తాత్కాలిక నిర్మాణాల కూలగొట్టడానికి మున్సిపల్ అధికారులకు సహకరించడం వంటి పలు అంశాలపై చర్చించారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ కిషోర్, రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, బద్దం పరుశురాం రెడ్డి,రావుల అంజయ్య , జీ కే హనుమంత్ రావు,ఢిల్లీ పరమేష్ , తదితరులు పాల్గొన్నారు.