Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ సమస్య, బొల్లారం బజార్ రైల్వే ట్రాక్ సమీపంలో గల కొత్త బస్తీ RUB డ్రైనేజ్ సమస్యల గురించి రైల్వే డివిజనల్ మేనేజర్ GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్ : ఈరోజు హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ సమస్య, బొల్లారం బజార్ రైల్వే ట్రాక్ సమీపంలో గల కొత్త బస్తీ RUB డ్రైనేజ్ సమస్యల గురించి రైల్వే డివిజనల్ మేనేజర్ GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఇందులో ముఖ్యంగా మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా శ్రీ నగర్ కాలనీ గల పరిశ్రమల వాడల నుండి వెలువడిన రసాయన వ్యర్ధాలు, మురుగు నీరు, వర్షపు నీరు లోతట్టు ప్రదేశాలలో మురుగు నీరు నిల్వ ఉండడం వలన స్థానిక శ్రీనగర్ కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు . కావున శ్రీనగర్ కాలనీ పక్కన అనుకొని ఉన్న రైల్వే స్థలం గుండా 450 mm dia RCC NP4 తో కూడిన సీవరేజ్ పైప్ లైన్ ను లాల పేట్ నాలా లో కలిసే విధంగా ప్రతిపాదనకు అనుమతి

బొల్లారం బజార్ రైల్వే ట్రాక్ సమీపంలో గల కొత్త బస్తీ RUB డ్రైనేజ్ వద్ద డయా సైజు చిన్నది ఉండడంవల్ల మురుగునీరు వ్యర్ధాలు నిలిచిపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ స్తంభిస్తున్నది కావున మురుగు నీరు వ్యర్ధాలను తొలగించాలని రైల్వే అధికారులలో చర్చించి పరిష్కార దిశగా కృషి చేయాలని రైల్వే డివిజనల్ మేనేజర్ లోకేష్ విష్ణోయ్ గారికీ ఎమ్మెల్యే గారు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైల్వే డీన్ ఇంజినీర్ ముత్యాల నాయుడు, GHMC Projects ఇంజనీరింగ్ , ఈ ఈ సురేష్, రేణుకా, డి ఈ రామచందర్, సుదర్శన్, ఏ ఈ సాయి కృష్ణ, IALA మేనేజర్ శ్రీనివాస్ , GHMC ఇంజినీర్లు డి. ఈ కార్తిక్, ఏ ఈ రవళి , బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, ముర్గేష్ ,రాము యాదవ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, ఇబ్రహీం, అరుణ్ , నర్సింగ్ రావు కాలనీ అసోసియేషన్ సభ్యులు రఫిక్, నయీం తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News