అల్వాల్: ఈ రోజు లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల లోని ఇనిగో హాల్ లో జరిగిన ఇనాగ్రల్ సెర్మోని ఆఫ్ NEGOTIUM 2K24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై ఏ విషయానికి అధైర్య పడకుండా ముందుకు వెళ్లాలని స్ఫూర్తి ద్వారకమైన ఉపన్యానం చేసి విద్యార్థులలో ఆత్మ స్థైర్యం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోజి రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ఏం. జోసెఫ్ కుమార్, ప్రొఫెసర్ డాక్టర్ లింబాద్రి, డీన్ డాక్టర్ రాచేల్ శాలిని, మేరీ ప్యట్రిసియ, బి ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్ , అరుణ్ తేజ, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.