మల్కాజ్ గిరి, మధురా నగర్: ఈరోజు మల్కాజ్గిరి , మధురా నగర్ లోని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి బద్ధం పుష్పా లతా పరశురాం రెడ్డి గారి అధ్యక్షతన వారి నివాసంలో వినాయక్ నగర్ డివిజన్ బి అర్ ఎస్ నాయకుల విస్తృతస్థాయి సమావేశనికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ,మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి , మాజీ ఎం.బి.సి ఛైర్మన్ నందికంటి శ్రీధర్ , హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీ లు విఫలమైన విషయంన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని , మల్కాజ్గిరి రైల్వే చక్రబంధం నుండి విముక్తి పొందాలంటే, మల్కాజ్గిరి మరింత అభివృద్ధి చెందాలంటే , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్ధం పుష్ప లతా పరశురాం రెడ్డి,జే ఏ సి వెంకన్న, రావుల అంజయ్య, తులసి సురేష్, ఖలీల్, చందు ,మేడల మల్లికార్జున్ గౌడ్, , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బాలకృష్ణ ,ఫరీద్ , కరీమ్,, బద్ధం హేమంత్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి అజయ్ ,పేపర్ శ్రీను, ఎమ్మార్ శ్రీను, సర్వేశ్ యాదవ్,రామచందర్, అబ్బన్న, సంతోష్ వెంకటాచారి, సుధాకర్ చారి, జోసెఫ్, అరుణ్,అరుంధతి, సత్యలక్ష్మి శ్రీదేవి, సంధ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.