ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోనీ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ పాఠశాలలలో బోర్ వెల్, త్రాగు నీరు, మరుగు దొడ్ల మౌలిక వసతుల సదుపాయం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి SDF నిధుల ద్వారా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో PRTU అధ్యక్షుడు రామేశ్వర్ , ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గోపాల్ సురేష్ పాపిరెడ్డి ఆంజనేయులు గౌడ్ రామ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.