Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

ఈరోజు(04-03-2024) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ప్రస్తుతం డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహిస్తున్న ప్రదేశంలో అదనపు గదుల కొరకు SDF నిధుల ద్వారా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శైలజ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బండి రాజు, అధ్యాపకులు డాక్టర్ బ్రిజేష్, డాక్టర్ చంద్రయ్య , డాక్టర్ రమేష్, డాక్టర్ జగన్, డాక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Gallery