మల్కాజ్ గిరి: 02-03-2024
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏకైక ఆరోగ్య సంస్థ మన మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రి . ఈ రోజు శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ది సొసైటీ సమావేశంలో పాల్గొని మెరుగైన వైద్య సేవల కల్పన, చేపట్టవలసిన పనులు, మౌలిక వసతుల కల్పన ఇతర సౌకర్యాల కోసం విభాగాల వారీగా పలు అంశాలు, ప్రతిపాదనలపై చర్చించారు.
ప్రథమంగా 3 వ అంతస్తులో #NICU #Palliativecare సేవలు అందిస్తున్నామని లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో రోగాలకి ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారికి తెలిపారు.
కమిషనర్ దృష్టికి తీస్కువెళ్లి త్వరితగతిన మరమత్తుల పనులను పూర్తి చెయ్యాలని సూపరింటెండెంట్ ఆదేశిస్తూ.
ఆసుపత్రిలో వివిధ పరికరాలు, ఇతర వసతుల కల్పనలో #CSR సంస్థలు దాతృత్వంను ప్రశంసిస్తూ వారి సేవలను ప్రోత్సహిస్తూ వినియోగించుకోవాలని సూచించారు.
ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తపరుస్తు వైద్యబృందం అభినందించారు. రాబోయే రోజుల్లో నిధులతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రణాళిక బద్ధంగా ఒక్కొక్కటిగా చేపడుదామని తెలియచేశారు
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి, మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ డి