Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని పార్టీ క్యాంప్ ఆఫీసులో కలిసిన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

ఈరోజు(02-02-2024) ఉదయం కల్లుగీత కార్మిక సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు వెంకట నరసయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని కలిశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.తాళ్ళు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి చెట్టుపై నుంచి జారి పడుతున్నారు బ్రతుకుతెరువు కోసం వృత్తి ప్రమాదమైనప్పటికీ పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారు. రోజుకు వనాలు తగ్గిపోతున్నాయి. లిక్కర్ బెల్టు షాపుల వలన కల్లు అమ్మకాలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాలలో సొసైటీలు రద్దు కావడంతో అక్కడి గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలేనక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేశారు.దీనిని టూరిజం శాఖ నిర్వహిస్తుంది.వీటిని పరిశీలించి మాకు వృత్తిలో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబల శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్, సట్ల ప్రభాకర్ గౌడ్, దొంతి ఆంజనేయులు గౌడ్ తదితరులు ఉన్నారు

Gallery