మచ్చ బొల్లారం : ఈ రోజు
మచ్చ బొల్లారం డివిజన్ మల్లికార్జున్ నగర్ లో అధికారులు, స్థానికులతో కలిసి పర్యటించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మల్లికార్జున్ నగర్ లో ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగు నీరు, పార్క్ అభివృద్ది, సీసీ రోడ్డు, వీది దీపాలు ల ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. డ్రైనేజీ ఔట్ లేట్ లేకుండా లేఅవుట్ లకు , బహుళ అంతస్తులకు మౌళిక సౌకర్యాలు లేకుండా అనుమతులు ఎలా ఇస్తారని? అధికారులను ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డి జీఎం భాస్కర్ , మేనేజర్ మల్లికార్జున్, ఇంజనీరింగ్ విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్, స్ధానిక కాలనీ వాసులు అశ్విన్ , నిఖిల్, సన్నీ , ప్రమోద్, సంజీవ, మహేశ్వరి, అరుణ్ బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ యాదవ్, ఢిల్లీ పరమేష్, శోభన్, సందీప్ , వెంకట్, మల్లేష్ యాదవ్, సతీష్, రమేష్ చారీ , హనుమాన్ చారీ, నామ్ దేవ్, జావేద్, స్ధానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.