హైదరాబాద్ : ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ROB/RUB , ఫ్లై ఓవర్స్ ల గురించి GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా వాజ్ పాయ్ నగర్, గౌతమ్ నగర్, బొల్లారం, సఫీల్ గూడా, అల్వాల్ లయోలా కళాశాల సమీపంలో, వెంకటాపురం, కాకతీయ నగర్, వినాయక్ నగర్, లలో ROB/RUB ల గురించి మరియు రామకృష్ణాపురం నూతన ఫ్లైఓవర్ ప్రతిపాదనలు అధికారులలో చర్చించి పరిష్కార దిశగా కృషి చేయాలని కోరారు. అందుకుగాను అధికారులు సానుకూలంగా స్పందించారు .ఈ కార్యక్రమంలో GHMC Projects చీఫ్ ఇంజనీరింగ్ దేవానంద్, GHMC ప్రాజెక్ట్స్ నార్త్ ఈస్ట్ జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ రవీందర్ రాజు, ఈ ఈ సురేష్, రాధికా, డి ఈ రామచందర్, సుదర్శన్, ఏ ఈ సాయి కృష్ణ, బి ఆర్ ఎస్ నాయకులు రాము యాదవ్, డోలి రమేష్, కాలనీ అసోసియేషన్ సభ్యులు బి టి శ్రీనివాస్ , రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.