ఈరోజు(05-03-2024) మధ్యాహ్నం గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం కార్మికులు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. యూనియన్ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమణారెడ్డి గారు, జనరల్ సెక్రెటరీగా సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బాల మల్లేష్, నరసింహులు, జైంట్ సెక్రటరీలుగా మధుసూదన్ రెడ్డి, మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి శ్రీను, కోశాధికారిగా సిహెచ్ ప్రసాద్ రావు,
కార్యనిర్వాహక సభ్యులుగా దిలేశ్వరరావు,సతీష్ కుమార్, వీరాంజనేయులు, సురేష్, ఖాదర్ వాలి,రాము, వెంకట్రావు, పనింద్ర బాబా,బాలకృష్ణలను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్ వీరభద్ర రావు, హెచ్ ఆర్ జోసెఫ్, రాజశేఖర్, కంపెనీ అడ్వైజర్ గోపి మల్లేష్ కంపెనీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.