ఈ రోజు (03-03-2024) సాయంత్రం అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది ఉన్నత శిఖరాలను చేరుస్తుందని, ఒక విద్యతోనే ఏదైనా సాధించగలమని ఒక పేదవాని రూపురేఖ లు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని హితభోదించారు.అనంతరం ఎమ్మెల్యే గారిని స్కూల్ యాజమాన్యం ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ AGM-జీవీ రమణ రావు గారు, జీవన్ రావు గారు, స్కూల్ ప్రిన్సిపాల్స్ -పి కరుణ బిందు గారు, హేమలత గారు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.