సికింద్రాబాద్: ఈరోజు హైదరాబాద్ సంచాలన్ భవన్ DRM కార్యాలయంలో ADRM గోపాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నగర్ డివిజన్ దినకరన్ నగర్ , తారకరామా నగర్ బస్తివాసులకు ఇటీవల రైల్వే శాఖ నుండి నోటీసులు అందించిన విషయంపై బస్తి వాసులతో కలిసి వినతిపత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ADRM గోపాల్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ బస్తీలలో పేద ప్రజల గత 20, 30 సంవత్సరాల నుండి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్నరు, పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టా సర్టిఫికెట్ పొందినవారికి కూడా రైల్వే శాఖ నుండి నోటీసులు అందజేయడం పై అభ్యంతరం వ్యక్తం చేసి సమస్యను పరిష్కరించాలని కోరగా ఈనెల 14వ తేదీన మరల సమావేశం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, ఢిల్లీ పరమేష్, అనిల్ కిషోర్, రాము యాదవ్, బస్తీ వాసులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.