ఘట్కేసర్: ఈరోజు ఘట్కేసర్ చౌదరిగుడా లోని చెరుకు బాలయ్య గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి విజయోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు , మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజు గారు* హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, చామకూర భద్రారెడ్డి, పీర్జాది గుడా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, చైర్మన్లు, కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.