మల్కాజ్ గిరి: ఈ రోజు మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ , రైల్వే ఉన్నత అధికారులతో కలిసి ప్రారంభించారు.
వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ యూనిట్లు
రైల్వే మంత్రిత్వ శాఖ భారతీయ రైల్వేలో మూడు అంచెల అంశాలతో వన్స్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ (ఓఎస్ ఓపి) పథకాన్ని ప్రారంభించబడినది. భారత ప్రభుత్వం ‘వోకల్ పర్ లోకల్’ దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం స్థానిక సాంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ ను కల్పించడం మరియు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అదనపు ఆదాయ మార్గాల పెంపు నకు కల్పించడం
ఈ పథకం కింద రైల్వే స్టేషన్లో సాంప్రదాయక స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన విక్రయం మరియు గరిష్ట ఆకర్షణ కోసం వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ విక్రయాలను కేటాయించబడినది .
ఈ విక్రయాలు ఏకరీతి గా ఉండేందుకుగాను నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా రూపకల్పన చేయబడినది ఈ యూనిట్లు నామమాత్ర శుల్కంతో 15 రోజుల నుండి మూడు నెలల వరకు కేటాయించబడతాయి.
ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు హైదరాబాద్ డిఎఫ్ఎం సందీప్, నూరు అహ్మద్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సూపరిండెంట్ మధు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సిగ్నల్ నరసింహ, రైల్వే సీఐ వాసుదేవ్, చీప్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సింగ్, బిఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, ఢిల్లీ పరామేష్, ఇబ్రహీం, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.