Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఎంబిసి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు అన్ని డివిజన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఎంబిసి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు అన్ని డివిజన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…….
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత దేశానికే దిశ నిర్దేశాన్ని చూపించి, ఒక గొప్ప న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, ఈ దేశం లోనే గొప్ప విద్యా వేత్తగా, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్.

ఈ దేశంలో పాతుకుపోయిన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ…. దళితులు, ముస్లింలు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల జీవిత చరిత్ర మార్చేసిన దార్శనికుడు, యోధుడు డా. బి. ఆర్. అంబేద్కర్.

దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమాన హక్కులు కల్పించే విధంగా సర్వ సత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా ఆ మహనీయుడు రాజ్యాంగాన్ని రూపొందించారు.

నేడు ఏప్రిల్ 14, డా. బి. ఆర్. అంబేద్కర్ గారి 133వ జయంతి. ప్రపంచ దేశాల సైతం “జయహో అంబేద్కరా అని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశానికి ఆయన అందించిన విలువైన సేవలను స్మరించుకుంటున్నాయి.

ప్రపంచ అపర మేధావులలో అతి ముఖ్యుడైన డా. బి. ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం కూడా కొనసాగిస్తూ ఆయన మార్గాల్లో నడుచుకోవాలని కోరుకుంటూ, మతతత్వ రాజకీయ పార్టీలను మట్టుకలిపి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News