Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి డివిజన్లోని ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు.

మల్కాజ్గిరి: ఈరోజు(23-06-2024) మల్కాజ్గిరి డివిజన్లోని ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు *ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని

*ఆనంద్ బాగ్ ఆర్ యు బి దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయించాలని,

*ఆనంద్ బాగ్ మెయిన్ రోడ్డు ఆక్రమణకు గురికాకుండా చూడాలని,

*ఆనంద్ బాగ్ జంక్షన్ అభివృద్ధి పరచాలని,

*సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,

*ప్రతినెల సీనియర్ సిటిజనుల కొరకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని,

*సఫిల్గుడా చెరువులో ఉన్న గుర్రపు డెక్క తొలగించి దోమల బారి నుండి కాపాడాలని వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాలనీవాసులు ఎమ్మెల్యే గారిని మాజీ కార్పొరేటర్ గారిని శాలువాలతో సత్కరించారు.

ఈ యొక్క కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, మేకల రాము యాదవ్, సర్వే నరేష్, ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ , బి ఎస్ ఆర్ కే శాస్త్రి , రామలింగేశ్వర రావు, సురేష్ కుమార్, రాంబాబు, శేష్ కుమార్, సూర్య కుమారి,వాణిశ్రీ, సుమలత ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News