Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజ్ గిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్స్ లో నిర్వహించిన మల్కాజిగిరి నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు,మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజ్ గిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్స్ లో నిర్వహించిన మల్కాజిగిరి నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, ,మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎం బి సి చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు , బి ఆర్ ఎస్ యువ నాయకులు డాక్టర్ చామాకూర భద్రా రెడ్డి గార్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తాన్నారు మల్కాజిగిరి ముఖచిత్రాన్ని మార్చామని, చేసిన అభివృద్ధితో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి అత్యధిక ఓటింగ్ చేసుకుంటూ మల్కాజ్గిరి లోక్ సభ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజుల్లోనే ఈ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగివేజారి మాకొద్దు ఈ ప్రభుత్వము అనే స్థాయికి తీసుకొచ్చారన్నారు.

అదేవిధంగా ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ గారు మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పే గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే 101 వ రోజు నుంచి బొంద తొవ్వడం మొదలు పెడదామన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటినుండి కేసీఆర్ని బదనాం చేయడం తప్ప రేవంత్ రెడ్డి చేసే పని ఏమీ లేదన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజక వర్గం జిహెచ్ఎంసి పరిధికి చెందిన కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సబితా అనిల్ కిషోర్, శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి, శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ ముర్గేష్, మాజీ కార్పొరేటర్లు జీ. కే. శ్రీదేవి హనుమంత్ రావు, ఆకుల నర్సింగ్ రావు, బద్దం పరశురామ్ రెడ్డి, రావుల అంజయ్య, జితేందర్ రెడ్డి,అమీనుద్దిన్, డొలి రమేష్, ఢిల్లీ పరమేష్, ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, మహిళలు,అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Gallery