Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజిగిరిలోని సఫిల్ గూడ పార్కులో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

సఫిల్ గూడ, మల్కాజ్ గిరి:

మల్కాజిగిరిలోని సఫిల్ గూడ పార్కులో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,

సఫీల్ గూడ పార్క్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

నన్ను గెలిపించండి..ప్రజలకు అందుబాటులో ఉంటా – బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజిగిరిలోని సఫీల్ గూడ పార్కులో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డిలు హామీ ఇచ్చారు. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయట పడేందుకు వ్యాయామం దోహద పడుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్కులో ఉన్న పలు సమస్యలతో పాటు గుర్రపు డెక్క తొలగింపు, జిమ్ పరికరాల మరమత్తులు , ఫ్యాగింగ్, పారిశుధ్య నిర్వహణ, సమస్యల కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి వాకార్స్ కు హామీ ఇచ్చారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని రాగిడి లక్ష్మారెడ్డి వాకార్స్ కు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి సమస్యలపై పార్లమెంటులో కొట్లాడుతనాని రాగిడి లక్ష్మారెడ్డి వివరించారు. అనంతరం లాఫింగ్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లాఫింగ్ కమిటీ సభ్యులు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు,
ఎం బి సి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్ మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, రావుల అంజయ్య, రాము యాదవ్, నవీన్ యాదవ్, మల్లేష్ యాదవ్, ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీం, సాదిక్, ఫరీద్, ఏ బి సి లాఫ్టర్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు వెంకటాచారి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు వాకార్స్ పాల్గొన్నారు.

Gallery

Latest News