Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరెడ్ మేట్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి గారి నివాసంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు సాధించిన పురోగతి అభివృద్ది నీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారిగా సుదీర్ఘంగా వివరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

నేరెడ్ మేట్ : ఈ రోజు నేరెడ్ మేట్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి గారి నివాసంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు సాధించిన పురోగతి అభివృద్ది నీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారిగా సుదీర్ఘంగా వివరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
మల్కాజ్ గిరి ప్రజలు తన పై ఉన్న నమ్మకాన్ని నిలబెడతానని వివిధ శాఖల అధికారుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

రైల్వే శాఖ:

పలుమార్లు రైల్వే ఉన్నత అధికారులను కలుస్తూ మల్కాజ్ గిరి సమస్యలు వివరిస్తూ తుర్కపల్లి LC 249 ఆర్ యు బి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి శంకుస్థాపన చేశామని, డ్రైనేజ్,నాలా సమస్యలు తొలగిస్తున్నామని

జి హెచ్ఎంసి: జి హెచ్ఎంసి అల్వాల్ మార్కెట్ అధికారులతో అభివృద్ధి సమీక్షలు , జిహెచ్ఎంసి సర్వసభ్య సాధారణ సమావేశంలో పాల్గొని ప్రజల ద్వారా వచ్చిన ప్రజా సమస్యల వినతిపత్రాలను జత చేసి మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ గారినీ కోరారని

జలమండలి శాఖ:
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు కాలనీ, బస్తీ లలో పర్యటించి తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ, త్రాగునీరు , డ్రైనేజీ అవుట్లెట్లు సమస్యలు పరిష్కరించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి గారిని జలమండలి జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్లను కలుస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరాము

ఇరిగేషన్ నీటి పారుదల శాఖ:
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వివిధ చెరువులు బండ చెరువు సభ్యులు కూడా ఆర్కేపురం చిన్న రాయిని చెరువు కొత్తచెరువు మోతుగులకుంట చెరువులను అధికారులతో సందర్శించి పరిశీలించి చెరువులలో ఉన్న గుర్రపు డెక్క తొలగించాలని, దోమల బెడద నుండి ప్రజలను రక్షించాలని, చెరువులలోకి మురుగునీరు రాకుండా చూడాలని అధికారులను కోరారు

రెవెన్యూ శాఖ:
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్, ఆర్డిఓ అధికారులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ఎస్టి ఎస్సి అట్రాసిటీ కేసు సమస్యలు పరిష్కరించాలని

స్పెషల్ డెవలప్మెంట్ నిధులు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కొరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, కలెక్టర్ గారికి ప్రతిపాదన,వినతి పత్రాలు అందజేశానని

విద్యుత్ శాఖ:
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విద్యుత్తు త్రీఫేస్ కరెంటు, అవసరమైన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు ,బంచ్ కేబుల్ ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కొరకు అధికారులను కోరమని

రోడ్డు భవనాల శాఖ అధికారుల తో సమీక్ష నిర్వహించి జిల్లా కోర్టు భవనం పనులు త్వరలోనే పూర్తి చేయాలని

విద్యాశాఖ: మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి, డిగ్రీ కళాశాలకు, గ్రంథాలయానికి, ప్రభుత్వ స్థలం కేటాయించాలని కలెక్టర్ గారికి లేఖ రాశానని, జూనియర్ కళాశాలలో తన సొంత నిధులతో మరుగుదొడ్ల ఏర్పాటు తరగతి గదులు ఏర్పాటుకు కృషి చేశానని,

ఆరోగ్యశాఖ:
మల్కాజ్గిరి లోని ఏరియా ఆసుపత్రి లో డాక్టర్లు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని ఆసుపత్రిలో గల లిఫ్టు సమస్యను పరిష్కరిస్తానని, ఆసుపత్రికి వచ్చే పేద రోగుల కు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

నేరేడ్మెట్ యాప్రాల్ లో స్ట్రీట్ వెండర్కి కి సంబంధించిన తాత్కాలిక దుకాణాలను తొలగింపుకు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడనాని,

జే ఎల్ ఎస్ ఎన్ నగర్ లో పేద ప్రజలకు దేవదాయ శాఖ వారు అందించిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోర్టు ద్వారా స్టే తెప్పించానని

నేరేడ్మెట్ డివిజన్ దినకరన్ నగర్ తారకరామ నగర్ బస్తీ లలో నివసించే పేద ప్రజలకు రైల్వే శాఖ నుండి నోటీసులు అందించగా వారి కొరకు అండగా నిలబడి రైల్వే అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశానని

అదేవిధంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా మా మల్కాజిగిరి అభివృద్ధి కొరకు పలువురు ఉన్నతాధికారులకు లేఖలు రాశానని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ , సీనియర్ నాయకులు బద్దం పరుశురాం, రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, జీకే హనుమంతరావు, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, అనిల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మధుసుదన్ రెడ్డి , ఇబ్రహీం, ఉపేందర్, శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, వి.ఎన్ రాజు, అరుణ్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News