తుర్కపల్లి బొల్లారం: ఈ రోజు అమృత్ భరత్ స్టేషన్ పథకం లో భాగంగా రూ. 41 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్ ల బహుమతీ 554 రైల్వే స్టేషన్ ల పునరాభివృద్ధి కి మరియు 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు/ అండర్ పాస్ జాతికి అంకితం , శంకుస్థాపన ప్రారంభం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే జరిగే కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం లోని తుర్కపల్లి బొల్లారం రైల్వే గేట్ L C 249 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB ) శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్న మీకు నేను ఇచ్చిన హామీల్లో భాగంగా తుర్కపల్లి బొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జి కొరకు రైల్వే , జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను సమన్వయం చేస్తూ అందరిని ఏకతాటి పైకి తెచ్చి ప్రత్యేక చోరవతో మంజూరు చేయించి నేడు శంకుస్థాపన చేసుకున్నం ముందు ముందు మరిన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి, ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులు పాడిన గీతాలునృత్య ప్రదర్శించినలను తిలకించి బహుమతులను అందజేశారు . ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎం బి సి చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్, జావహర్ నగర్ కార్పొరేటర్ ముర్గేశ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి అర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, జీ కే హనుమంత్ రావు, రాము యాదవ్,రావుల అంజయ్య, కరమ్ చంద్, ఢిల్లీ పరమేష్ , లక్ష్మణ్ యాదవ్, సర్వే నరేష్, చిన్న యాదవ్, లడ్డు నరేందర్ రెడ్డి, శ్రీధర్, రైల్వే అధికారులు సాయి నాథ్, రజనీ, తహేర్ హుస్సేన్, గేట్ మన్ రాజు, స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు,బి అర్ ఎస్ నాయకులు, ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.