ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ వాణి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు సీసీ రోడ్లు, షటిల్ బ్యాట్మెంటన్ కోర్టు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సిద్దయ్య , నర్సింగరావు ,వీరభద్రరావు, రఘునాథ్, కుమార్, తిరుపతి, రఘునందన్, , తదితరులు పాల్గొన్నారు