Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు (04-03-2024)  మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జేన్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై IALA , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB), జల మండలి, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. ఇందులో ముఖ్యంగా మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాను అనుకొని ఉన్న శ్రీ నగర్ కాలనీలు పడుతున్న ఇబ్బందులు నీటి కాలుష్యం, గాలి కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవాలని, ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు నిలువ లేకుండా , నాలా ద్వారా సరైన మార్గంలో , వర్షపు నీరు, మురుగు నీరు ప్రవహించే విధంగా ఇంజనీరింగ్, జల మండలి, ఐలా ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో IALA కమీషనర్ తుల్యా నాయక్, ప్రాజెక్ట్ ఇంజినీర్ అనిల్ కుమార్, ఛైర్మన్ సత్యనారయణ రాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) EE రాజేందర్, జలమండలి అధికారులు DGM ఆశ్రిత, మేనేజర్లు వేణుగోపాల్ నాయుడు, వేణు గోపాల్, ఇంజనీర్ అదికారులు శ్రీకాంత్, స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్లు, SC ,ST ఇండస్ట్రియల్ చైర్మన్ సుహర్ లత, బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య , ముర్గేశ్, ఇబ్రహీం, శ్రీనగర్ కాలనీ వాసులు రఫీక్, నయిమ్, సూర్య ప్రకాష్, చందు, శ్రీనివాస్,వేణు, బి ఆర్ ఎస్ నాయకులు IALA సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News